calender_icon.png 8 July, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చదనాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం

08-07-2025 01:08:11 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్, జూలై ౭ (విజయక్రాంతి): మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని టీటీడబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులతో కలసి మొక్కలను నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.... రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యం తో పాటు అటవీ విస్తీర్ణాన్నీ పెంచి, పర్యావరణ స్థిరత్వాన్ని అందించడానికి మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్లు పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాల్లో మొక్కలను నాటాలని పిలుపు నిచ్చారు.

ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల, పాఠశాల ఆవరణలో రకరకాల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరు లు పాల్గొన్నారు.