ఆలయ చైర్మన్ శ్రీ రామయ్య శర్మను సన్మానించిన మాజీ ఎంపీటీసీ చాంద్ మియా
12-01-2026 07:12 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా నియమితులైన శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఎస్.కె చాంద్ మియా, ఉపసర్పంచ్ చిత్తలూరి వీరస్వామి వార్డు మెంబర్లతో కలిసి ఘనంగా సన్మానించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అనునిత్యం స్వామివారి సన్నిధిలో ధూప దీప నైవేద్యాల తో అనునిత్యం పూజలతో స్వామివారికి పూజలు చేసే పూజారి 17వ గుడి చైర్మన్ గా నియమితులైన ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.గుడి చైర్మన్ శ్రీరామయ్య శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్దే లక్ష్యంగా తను పనిచేయునున్నట్లు తెలిపారు.




