12-01-2026 07:10:07 PM
మంథని,(విజయ క్రాంతి): మంథని పట్టణ కేంద్రంలో ఎలక్ట్రాన్ మీడియా డివిజన్ నూతన ప్రెస్ క్లబ్ ను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకపాత్ర ఉందని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్ మీడియా విశేషంగా కృషి చేస్తోందన్నారు.
మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ ప్రారంభంతో మంథని ప్రాంతంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఒక వేదిక ఏర్పడిందని, ఇది మీడియా ఐక్యతకు, వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని క్లబ్ సభ్యులు అభిప్రాయపడ్డారు.