calender_icon.png 15 September, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య వ్యవస్థను బీఆర్ఎస్ చెడగొట్టింది: రామచందర్ రావు

15-09-2025 01:59:55 PM

హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం బంద్ నిర్వహించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు యాజమాన్యాల నిర్ణయానికి తెలంగాణ బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీలలో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని.. రాత్రి జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తారో కూడా వెల్లడించాలేదని అన్నారు. విద్య వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెడగొట్టిందని.. ప్రభుత్వ నిర్లక్ష వైఖరితో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని రామచందర్ రావు ఆరోపించారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి‌(CM Revanth Reddy)తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సోమవారం భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చిస్తున్నారు. అయితే ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సుమారు నాలుగు గంటలపాటు చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా కొనసాగాయని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సమ్మె విరమణకు యాజమాన్యాల నుంచి సానుకూల స్పందించినట్లు తెలిపారు.