26-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 25: పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసులో శిరోమణి అకాళీదళ్ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీమంత్రి బిక్రమ్‌సింగ్ మజీతి యా అరెస్టయినట్టు తెలుస్తోంది. విక్రమ్ మ జీతియా శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షు డు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు సొంత బావ. విక్రమ్ గతంలో పంజాబ్ రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్ మజీతియా ఎమ్మెల్యేగా ఉన్నారు.
2021 నాటి డ్రగ్స్ కేసులో బిక్రమ్ మజీతి యా నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు అమృత్‌సర్‌లోని మజీతియా నివాసంతో పాటు 25 ప్రాంతా ల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుం డా మజీతియా ఇంటిపైకి అధికారులు రైడిం గ్‌కు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా మజీతియా, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిస్తోంది.
ప్రాథమిక దర్యాప్తులో రూ.540 కోట్లకుపైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మజితీయా నియంత్రణలో ఉన్న పలు కంపెనీ లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలోకి రూ.161 కోట్లు అక్రమంగా వచ్చి చేరాయని, అనుమానిత విదేశీ సంస్థల నుంచి రూ.141 కోట్లు వచ్చినట్టు సిట్ అధికారులు గుర్తించారు.
మరో రూ.236 కోట్ల డిపాజిట్లకు సం బంధించి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. కాగా సిట్ దాడులను అకాలీదళ్ నేతలు ఖండించారు. అధికార ఆప్ కక్ష్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.