calender_icon.png 18 July, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నోబెల్’కు ట్రంప్ పేరు ప్రతిపాదన

26-06-2025 12:00:00 AM

  1. అధికారికంగా నామినేట్ చేసిన అమెరికా చట్ట సభ్యుడు బడ్డీ కార్టర్
  2. ప్రతిపాదన విరమించుకొన్న ఉక్రెయిన్ సభ్యుడు

వాషింగ్టన్, జూన్ 25: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు ఎర్ల్ బడ్డీ కార్టర్ నామినేట్ చేశారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతి అందించాలంటూ నార్వేలోని నోబెల్ కమిటీకి ఒక లేఖను పంపించారు.

అయితే ఉక్రెయిన్‌కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝూకో కూడా గతంలో నోబెల్‌కు ట్రంప్ పేరును ప్రతిపాదించారు. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలం కావడంతో తాజాగా ఆయన ట్రంప్ నోబెల్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఎంత చేసినా తనకు నోబెల్ రావడం లేదంటూ ట్రంప్ ఇటీవలే తన సామాజిక మాధ్యమం  ‘ట్రూత్’లో అసహనం వ్యక్తం చేశారు.