27-10-2025 05:42:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో 3.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేయడం జరిగిందని మరో 18.70 కోట్లతో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బీరవెల్లి ఎత్తిపోతల పథకానికి 6.91 కోట్లు ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఈ పనులన్నీ త్వరలో పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.