2 July, 2026 | 2:19 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి లారీ ఇటుకను అందజేసిన మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి

25-06-2025 08:33 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): కాల్వ శ్రీరాంపూర్ మండలం(Kalva Srirampur Mandal)లోని పాండవుల గుట్ట సమీపంలో నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయానికి కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి తనవంతుగా ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విలువ చేసే ఇటుక లోడును బుధవారం అందజేశారు. పాండవుల గుట్ట సమీపంలో జరిగే ఆలయ నిర్మాణ పనులను జడ్పీటీసీ సందర్శించారు. ఆలయ నిర్మాణానికి ఇటుకను అందజేసిన తిరుపతిరెడ్డికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడెపు రాజు, ఓరుగంటి కొమురయ్య, పెద్దిరెడ్డి వీరారెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్, ఉప్పుల కుమార్, తాత రవి, స్వామి తదితరులు ఉన్నారు.