calender_icon.png 11 October, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కోర్టు భవనానికి శంకుస్థాపన

11-10-2025 02:09:45 AM

  1. విచ్చేయనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ 

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు నూతన భవనాలకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదన కలెక్టర్ వీరారెడ్డి ఇతర అధికారులు పరిశీలించారు.  భువనగిరి పట్టణ శివారు మాస్ కుంట, ఎస్ ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కళాశాల సమీపంలో నీ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 742 లో కేటాయించిన పది ఎకరాల స్థలంలో సుమారు రూ.82 కోట్ల అంచనా వ్యయంతో ఆరు అంతస్తులుగా నిర్మిస్తున్నారు.

ఈ మేరకు నేడు ఉదయం 11 20 గంటలకు నిర్వహించనున్న శంకుస్థాపనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్యఅతిథిగా రానున్నారు వారితోపాటు మరికొంతమంది హైకోర్టు న్యాయమూర్తులు కార్యక్రమంలో పాల్గొన్నవారు. స్థానిక ఎన్నికల కు హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తొలగిన కారణంగా మంత్రులు ఎమ్మెల్యేలు సైతం పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఆరు అంతస్తులు 12 కోర్టు హాళ్లు 

నూతన కోర్టు భవనాన్ని రూ.82 కోట్ల అంచనా వ్యయంతో ఆరు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. రాళ్లు రప్పల గుట్టలుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చదును చేస్తే నిర్మాణ వ్యాయామం  పెరుగుతుండడంతో అనువైన స్థలాన్ని చదును చేసి మిగతా ప్రాంతాన్ని యధావిధిగాని ఉంచి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి రెండు అంతస్తులుగా స్లాబ్ చేయనున్నారు ఈ రెండింటిని పార్కింగ్ తదితర అవసరాలకు వినియోగించేలా డిజైన్ చేశారు.

మిగతా నాలుగు అంతస్తులలో 12 కోర్టులు, న్యాయమూర్తుల విశ్రాంతి భవనాలు. కార్యాలయాలు, బార్ అసోసియేషన్, కక్షిదారుల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నాలుగు లిఫ్టులు ప్రతిపాదించారు. టెండర్ విధానములో కెఎంవి ప్రాజెక్టు పనులను దక్కించుకుంది.

2026 చివరి నాటికి నూతన భవనాలు అందుబాటులోకి వస్తాయని జుడిషియల్ అధికారులు తెలిపారు నూతన భవనాల నిర్మాణం పూర్తయిన అనంతరమే పట్టణంలోని కోర్టులను అక్కడికి తరలిస్తారు. ఎకరం పైగా విస్తీర్ణంలో ఉన్న భవనాల స్థల వినియోగంపై న్యాయశాఖ అభిప్రాయం మేరకు రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

రూ. 984 కోట్లతో 12 భవనాలు 

కోర్టులలో మౌలిక వసతుల కల్పన తదితర లక్షలతో రాష్ర్టంలోని 12 పునర్విభజన జిల్లాలలో రూ. 984 కోట్లతో నూతన భవనాలను నిర్మిస్తున్నారు ఈ మొత్తంలో కేంద్రం 40% రాష్ర్ట ప్రభుత్వం 60% నిధులను విడుదల చేయనున్నాయి. 12 కోర్టుల నిర్మాణ పనులకు ఒకే ప్యాకేజీగా పిలిచిన టెండర్లలో కెఎంవి ప్రాజెక్టు పనులను దక్కించుకున్నది జిల్లా కలెక్టర్ భవనాలను నిర్మించింది కూడా ఇదే సంస్థ అన్ని భవనాల శంకుస్థాపనలను వారం రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టుతో పాటు ప్రభుత్వం సంకల్పించింది. ఆర్ అండ్ బి శాఖ, పనులను పర్యవేక్షించనున్నది.