11-10-2025 10:11:01 AM
న్యూఢిల్లీ: శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఇండియా-వెస్టిండీస్(India vs West Indies) మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచులో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 325 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్(175) వద్ద రనౌట్(Yashasvi Jaiswal Run Out) అయ్యాడు. శుభ్ మన్ గిల్ సమన్వయకోపం కారణంగా యశస్వి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో జైస్వాల్ డబుల్ సెచరీ చేసే అవకాశం చేజారింది. అనంతరం క్రీజులో తెలుగు కుడ్రాడు నితీశ్ రెడ్డి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 96.1 ఓవర్లకు 353 పరుగులు చేసింది మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో గిల్ (43), నితీశ్ రెడ్డి (10) పరుగులతో ఆడుతున్నారు.