11-10-2025 02:09:40 AM
విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, అక్టోబర్ 10: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అగ్రవర్ణాల కుట్ర అంటూ మండిపడ్డాయి. హైకో ర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బందుకు పిలుపునిచ్చింది. స్టేకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు బీసీ సంఘాల ఆధ్వ ర్యంలో రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారు.
జీవో 9కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించి ఉంటే స్టే వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టులో స్టేలు విధిస్తూ బీసీలను బలి పశువులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వే షన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నా యని ఫైర్ అయ్యారు.
ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్పా బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కింది నుంచి పైకోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. బిజెపి నేతలు గవర్నర్‌ను కలిసి ఉంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునేవారని, బీజేపీ ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అనడం సిగ్గుచేటు అన్నారు.
తెలంగాణ బిసి కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ ఎం భాగయ్య హైకోర్టు న్యాయవాది సుదర్శన్‌తో కలిసి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బిసి లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్స్ లలో బిసి కులాల దమాషా ప్రకారం ఏబీసీడీ వర్గీకరణ చేసి రిజర్వేషన్స్ కేటాయించాలని కోరారు. మేడ్చ ల్ పట్టణంలో బీసీ సేన విద్యార్థి సంఘం ఆధ్వర్యం లో విద్యార్థినులు ధర్నా, రాస్తారోకో నిర్వహించా రు.
కార్యక్రమంలో బీసీ సేన విద్యార్థి సంఘం కేం ద్ర కమిటీ అధ్యక్షుడు గోదా అరుణ్ యాదవ్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సం ఘాలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘా ల ఆధ్వర్యంలో బషీర్ బాగ్‌చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుం దారం గణేష్ చారి, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రె స్, బిఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బీసీ రేజర్వేషన్లను రాజకీయ క్రీడగా మార్చారని ఆమ్ ఆద్మీ పా ర్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజ్యా ధికార పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కూడలిలో ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని దహనం చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
కార్యక్రమంలో టీఆర్పీ నాయకు లు బొంగు వెంకటేష్ గౌడ్, కోట్లవాసు దేవ్, బీమగాని మహేష్ గౌడ్, ఈశ్వర్, రాజ్ సీతా రం నా యక్ పాల్గొన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై రా జ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాలని, హై కోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అ ప్పీల్‌కు వెళ్లాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో
బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం సిగ్గుచేటని సీపీఎం కామారెడ్డి జిల్లా కార్య దర్శి చంద్రశేఖర్ అన్నారు. గవర్నర్ చేత కూడా ఆమోదం పొందకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ని జాంసాగర్ చౌరస్తాలో బిసి రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి కుంబాల్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గుడిసె యాదగిరి, మోహణాచారి, అబ్దుల్ అజీజ్, నారాయణరావ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పలు జిల్లాల్లో
భద్రాద్రి జిల్లా భద్రాచలంలో బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు ఆధ్వర్యంలో అం బేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. బీసీ నాయకు లు జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవి మాట్లాడారు. బూర్గంపాడులో బీసి సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాదాద్రి జిల్లా మునుగోడు లో బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ ఆధ్వ ర్యంలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
హైకోర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బందుకు పిలుపునిచ్చింది. హనుమకొండలోని కాళోజి జంక్షన్ వద్ద బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగులు జీవో నెంబర్ 9 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్‌ముదిరాజ్ మాట్లాడు తూ.. హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో బీసీలకు శాశ్వతంగా 42 శాతం రిజర్వేషన్ అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేందుకు ఉద్యమం తీవ్రతరం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జీవో 9ను ప్రవేశపెట్టి బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో అగ్రకులాలను బీసీలు తరిమికొడతారనే భయంతోనే చెల్లని జీవో 9 పెట్టి రాజకీయ పార్టీలు చేసిన కుట్రలను టీఆర్పీ బట్టబయలు చేస్తుందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీలు బంధు విజయవంతం చేశారు.
కార్యక్రమంలో వరంగల్ జిల్లా టీఆర్పి నాయకులు పెండల సంపత్ పటేల్, జంగిలి శ్రీనివాస్, పోలు రాజు, పల్లకొండ చందు, మాదం నరేష్ యాదవ్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ నేతృత్వంలో కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వ ద్ద రాస్తారోకో చేశారు. రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకుడు రవి పటేల్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.