11-10-2025 08:35:40 AM
వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై(Chinese products) అదనపు సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) హెచ్చరించారు. చైనా దిగుమతులపై 100 శాతం అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అదనపు సుంకాలు నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇప్పుడున్న టారిఫ్ లకు అదనంగా మరో వందశాతం సుంకం విధిస్తామని తెలిపారు. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా(China) ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఆంక్షలకు ప్రతి చర్యగా ఆ దేశ ఉత్పత్తులపై మరోసారి సుంకాలు తప్ప వని ట్రంప్ హెచ్చరించారు. చైనాతో మంచి సంబంధాలే కొనసాగించినా.. వారి చర్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాలతోపాటు మరిన్ని చర్యలు పరిశీలిస్తున్నామని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ బెదిరించారు.