11-10-2025 10:53:33 AM
బండి ఈటల మధ్య పొలిటికల్ వార్
కరీంనగర్,(విజయక్రాంతి): బీజేపీలో బి ఫారంల పంచాయతీ మరో మారు బహిర్గతం అయింది. హుజురాబాద్ బాథ్ షా నేనంటే నేనని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), ఎంపీ ఈటల రాజేందర్ ల మాటల తూటాలు వదులు తుండటం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య అంతర్గత వర్గ పోరు హుజురాబాద్ లో ఈటల చేసిన వ్యాఖ్యల అనంతరం బయటపడింది. హుజరాబాద్ లో ఈటల రాజేందర్(Etela Rajender) మాట్లాడుతూ... 25 సంవత్సరాలనుండి నేను ఇక్కడ లీడర్ నని మేమే బి. ఫామ్స్ ఇస్తామని మేము ఇవ్వకుండా ఎవరిస్తారని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతో టికెట్లు రావని గ్రూపులు, వర్గాలుగా కొనసాగుతున్న అనుచరులకు టికెట్లు బి. ఫామ్స్ ఇచ్చే సంప్రదాయం బీజేపీలో లేదని బండి ప్రధాన అనుచరుడు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. వీరి ఆధిపత్య పోరుతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక పోరు సంగతి తెలక ముందే బి ఫారంల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది.