సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఇల్లందు టౌన్, జూన్ 21 (విజయక్రాంతి): విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులకు ఆదివారం సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన రోడ్డును మరింత ముందుకు విస్తరించేందుకు అవసరమైన నిధులను త్వరగా మంజూరు చేయాలని, అలాగే సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని అన్ని వీధులకు సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు.
కార్యక్రమంలో తిలక్నగర్ సర్పంచ్ స్రవంతి, విజయలక్ష్మి నగర్ ఉపసర్పంచ్ రేణుక, తిలక్నగర్ ఉపసర్పంచ్ ఖాసీం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పూనెం సురేందర్, మాజీ ఉపసర్పంచ్ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు హరిసింగ్, వెంకటేష్, సదా, మల్లికా, సౌజన్య, కళావతి, అజయ్, భద్రు, వసంత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.






