27 August, 2026 | 9:09 AM

నకిలీ పత్తి విత్తనాల విక్రయం: మహబూబాబాద్‌లో పోలీసుల ప్రత్యేక కార్డెన్ సర్చ్

22-06-2026 02:08 AM

పోలీసుల ప్రత్యేక కార్డెన్ సర్చ్!

మహబూబాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో ఆదివారం ఉదయం ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు నకిలీ, నిషేధిత పత్తి విత్తనాల కోసం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఆ గ్రామంలో పలువురి ఇళ్లలో నిషేధిత, నకిలీ బీటీ 3 (లూజ్) పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. కొందరు పోలీసుల రాకను గమనించి తమ వద్ద ఉన్న విత్తనాలతో పారిపోగా, నకిలీ విత్తనాలను కలిగి ఉన్న రైతుల నుంచి 12 కిలోల నకిలీ, బీటి 3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్టు మరిపెడ సీఐ పవన్ కుమార్ వివరించారు.

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ, జాతీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.