13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

చిట్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

09-01-2026 09:00 PM

చిట్యాల,(విజయక్రాంతి): సుమారు మూడు కోట్ల అంచనా వ్యయంతో చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో 3  కోట్ల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కొన్నిచోట్ల పార్టీకి చెందిన పాత, కొత్త నాయకుల మధ్య అంతరం ఏర్పడి కొన్ని స్థానాలను గెలవలేకపోయామని అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఎలాంటి ఇగోలు ఏవి పెట్టుకోకుండా సమిష్టిగా పని చేయాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లుగా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేకపోయిందని కానీ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లలోనే నకరేకల్ నియోజకవర్గ పరిధిలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే వేముల వీరేశంకు దక్కుతుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కచ్చితంగా పార్టీ అవకాశాలు కల్పిస్తుందని అప్పటివరకు ఓపికతో ఉండాలని సూచించారు. త్వరలోనే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాటికి అదనంగా మరో 300 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి సుమారు 600  ఇండ్లను పేదలకు పంచేందుకు చర్యలు తీసుకోనున్నామని ఆయన అన్నారు.

ప్రతి ఒక పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుందని అందువల్లే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని, విజయ పరంపర కొనసాగించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. అందుకు వీలుగా ప్రతి వార్డుకు అనుభవజ్ఞులైన నాయకులను ఇన్చార్జిలుగా నియమించడం జరుగుతుందన్నారు. వారి దిశా నిర్దేశత్వంలో పార్టీ నాయకులు పనిచేసి పోటీచేసిన ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.