23-11-2025 06:03:57 PM
చిట్యాల (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ఆదివారం భూమి పూజను నిర్వహించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల, వెంబావి గ్రామాల సరిహద్దు (బోడ గుట్ట) ప్రాంతం లో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం లో ఎమ్మెల్యే ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమమంలో వారితో పాటు మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, పాకాల దినేష్, ఉరుమడ్ల, వెంబావి గ్రామాల అయ్యప్ప మలధార స్వాములు పాల్గొన్నారు.