23-11-2025 05:13:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాలలో ఆదివారం ఉదయం 9:30 నుండి పగలు 12:30 వరకు జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షల్లో 1043 విద్యార్థులగాను 1017 విద్యార్థులు హాజరుకాగా 26 మంది విద్యార్థులు గైరాజరయ్యారు హాజరు శాతం 97.5 కాగలదు. పరీక్ష నిర్వహణ కొరకు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, సెంటర్ లెవెల్ అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు. ప్రతి కేంద్రంలో పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాలను నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సందర్శించారు.