calender_icon.png 23 November, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శిగా గిరగాని యాదగిరి

23-11-2025 05:05:37 PM

నకిరేకల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన గిరగాని యాదగిరి ని నియమించినట్లు ఆదివారం ఆయన విలేకరులకు తెలిపారు. గతంలో యాదగిరి పిఎం విశ్వ కర్మ యోజన తుంగతుర్తి నియోజకవర్గ కన్వినర్ గా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకముతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

నా మీద నమ్మకాన్ని వృధా చేయకుండా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నాకు అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య,జిల్లా అధ్యక్షులు చల్లా శ్రీలత రెడ్డి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తోట వినోద్ కుమార్, మండల నాయకులు కొండ్రేడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.