23-11-2025 05:11:58 PM
ఆధ్యాత్మిక కేంద్రంగా శాస్త్రి నగర్
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ధృడసంకల్పంతో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణ పనులు ప్రారంభించి త్వరతిగతిన పూర్తిచేసి... ప్రారంభానికి సిద్ధం చేసిన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్, మాజీ సర్పంచ్ సాయిరీ మహేందర్ పద్మ దంపతుల పట్టుదల సేవ, కృషి అభినందనీయం... గత 15 ఏళ్లుగా అయ్యప్ప స్వామి భక్తులకు శాస్త్రి నగర్ లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నిరంతరంగా అన్నప్రసాద వితరణ మహోత్సవాన్ని నిర్వహించి... సేవా ధర్మంతో నిత్య అన్నదాన నిర్వాకులు... ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో మరొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని సృష్టించబోతున్నారు.
ఈ పుణ్య యజ్ఞంలో భాగంగా శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టి, స్వామివారి అనుగ్రహంతో పంచలోహ విగ్రహం.. పరివార దేవతల విగ్రహాలు.. యంత్ర ప్రాణ ప్రతిష్ట.. ధ్వజస్తంభం... శిఖర కలశ ప్రతిష్ట.. మహోత్సవాలను నిర్వహించుటకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 24 నుండి 26 వరకు విధి విధానాలతో వేద మంత్రోచ్ఛరణాల నినాదాల మధ్య, భక్తి స్ఫూర్తితో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈ వేడుకలు జరగనున్నాయి. భక్తులందరూ ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో పాల్గొని , తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని సాయిరి పద్మ మహేందర్ దంపతులు కోరారు.
ఈ నెల 24న సోమవారం వేద స్వస్తి గోపూజ, శ్రీ మహాగణపతి పూజతో పాటు ఇతర పూజలు ఉంటాయి.
25న మంగళవారం ఆవాహిత దేవత పూజ, గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామి దేవత హవనములు.
26న ఉదయం ప్రాంత కాలపూజ, దేవత హవవనములు, వేద ఆశీర్వాచనం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణతో పాటు పలు కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవలు ఆధర్పణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ.. ఆలయ పురోహితులు గూడ రమేష్ శర్మల అధ్వర్యంలో జరుగుతాయి. సాయంత్రం బ్రహ్మశ్రీ సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గురు స్వామి వారిచే శ్రీ ధర్మశాస్త్ర వారి మహపడిపూజ మహోత్సవం విశేష అభిషేకములు నిర్వహించబడతాయి.. శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ వ్యవస్థాపకులు అండ్ చైర్మన్ సాయిరి మహేందర్ గురుస్వామి తో పాటు ట్రస్ట్ గౌరవాధ్యక్షులు మిట్టపల్లి మురళీధర్ గురుస్వామి... శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు మారవేణి లచ్చయ్య ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి...
శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ముఖ్యఅతిథిగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావులు పాల్గొంటారని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు అండ్ చైర్మన్ సాయిరి మహేందర్ తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని సాయిరి పద్మ మహేందర్ దంపతులు కోరారు.