23-11-2025 05:16:10 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని సదాశివనగర్ మండలంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు మండల విద్యశాఖ అధికారి యూసఫ్ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో 24 నవంబర్ 2025 రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, ఇట్టి ప్రదర్శన ఉపయోగపడుతుందని, కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులచే ఎగ్జిబిట్స్ తీసుకొచ్చి ప్రదర్శనలో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ తరపున కోరారు.