27 February, 2026 | 8:36 PM

హుజురాబాద్ లో డంప్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి

27-02-2026 06:54 PM

తూర్పాటి రాజు బిజెపి పట్టణ అధ్యక్షులు

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో డంపు యార్డ్ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారంనిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా వచ్చి ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని  డిమాండ్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెత్తను మొత్తం ఇక్కడ వేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతాయని అన్నారు. డంపు యార్డ్ ఏర్పాటు వల్ల ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలవుతారని,  ఇక్కడ ఉన్న వ్యవసాయ భూములు కూడా పాడవుతాయని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డంపు యార్డ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని అన్నారు. డంపు యార్డ్ ప్రతిపాదన ఉపసంహరించకుంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కందుగుల సర్పంచ్ మహేష్,  పట్టణ మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకట్ రెడ్డి,కౌన్సిలర్లు కోలుగురి సుమలత, రోహిత్, లక్ష్మిదుర్గ  జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్ బిజెపి సీనియర్ నాయకులు  నరాల రాజశేఖర్  తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, నల్ల సుమన్, దామెర అనురాగ్    బోరగాల సారయ్య,పవన్ కుమార్, కురిమిళ్ల శ్రీధర్, మోటపోతుల రాకేష్,  ఎర్ర శ్రీధర్, వివిధ మోర్ఛ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు,  బూత్ అధ్యక్షుల తోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.