12-10-2025 03:55:48 AM
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన గౌతమ్‌రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అంబర్‌పేటలోని మహంకాళి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.