మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్ ను కలిసిన నాయకులు
27-02-2026 06:52 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ తో పాటు కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు జ్యోతి, ఎంజి శారద సంతోష్, వసీమ్ మునీస్ షబీర్, దుర్గం సూరజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు మరియు కౌన్సిలర్లకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.




