14-07-2025 02:45:11 AM
- జాబితాలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్
- సామాజిక కార్యకర్తకూ చోటు
న్యూఢిల్లీ, జూలై 13: శాస్త్ర, సాంకేతిక రం గాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. రాష్ట్రపతి రాజ్యాంగంలోని నా ల్గవ షెడ్యూల్‌లో గల 80(2) ఆర్టికల్ కింద శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో కృషి చేసిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చే సే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇందులో భా గంగా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్‌లను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కేంద్రం ప్రకటిం చింది.
దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన ఉజ్వల్ నికం.. 26/11 ముంబై ఉగ్రదాడుల కేసు వి చారించారు. ఇది మాత్రమే కాకుండా హైళై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. భారత మాజీ విదేశాంగ కా ర్యదర్శి హర్ష్ వర్ధన్ అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు రాయబారిగా పని చేశా రు. కీలక దౌత్య పదవులు చేపట్టారు. ఇక కేరళకు చెందిన సదానందన్ మాస్టర్ ఉపాధ్యా యుడిగా విధులు నిర్వర్తించి.. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసా గుతున్నారు.
1994లో సీపీఎం నేతలు చేసిన దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు. ఇక మీనాక్షి జైన్ ప్రముఖ చరిత్రకారిణిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఆమెకు 2020లోనే పద్మశ్రీ అవార్డు వరించింది. జర్నలిస్టు కూతురు అయిన మీనాక్షి జైన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా కూడా పని చేశారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురిలో ఒకరు మహారాష్ట్ర, ఒకరు బాంబే, ఒకరు కేరళ, ఒకరు ఢిల్లీకి చెందిన వారు.