calender_icon.png 14 July, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిరోడ్డుపై లాయర్ కాల్చివేత

14-07-2025 02:43:21 AM

- బీహార్ రాజధాని పాట్నాలో ఘటన

- 24 గంటల్లో కాల్పుల్లో నలుగురు మృత్యువాత

పాట్నా, జూలై 13: పాట్నాలో ఓ వ్యాపారిని దుండగులు కాల్చి చంపిన ఘటన మరువకముందే మరో వ్యక్తిని పట్టపగలే కాల్చి చంపడం సంచలనంగా మారింది. బీహార్‌లో గడిచిన 24 గంటల్లో కాల్పుల ఘటనల్లో నలుగురు మరణించారు. ఆదివారం సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 300 మీ టర్ల దూరంలో జితేందర్ కుమార్ అనే న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగడంతో ఆ న్యాయవాది మృతి చెం దాడు. పట్టపగలే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ఓ టీషాపులో లాయర్ టీ తాగి వెళ్తుండగా.. దుండగులు కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరారైనట్టు పాట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. గాయాలపాలైన లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్టు పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతు న్నామని.. సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.