3 June, 2026 | 1:21 AM

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టటర్ల్ల పట్టివేత

03-06-2026 12:38 AM

కరీంనగర్ రూరల్, జూన్ 2 (విజయ క్రాంతి): అక్రమంగా ఇసుకను రవాణా చే స్తున్న నాలుగు ట్రాక్టర్లను రూరల్ పోలీసు లు పట్టుకున్నారు. పోలీసులు గ్రామాల్లో పె ట్రోలింగ్ నిర్వహిస్తుండగా  నగునూర్ గ్రా మానికి చెందిన సూర రాజమౌళి, ఒర్సు న ర్సయ్య  వాగు నుండి ఇసుకను దొంగలించి తమ ట్రాక్టర్లో కరీంనగర్

వైపుకు తరలిస్తుండగా నగునూర్ గ్రామం వద్ద  కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అలాగే సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి  గ్రామానికి చెందిన నాగపూరి అజయ్, ఎలవేణి సం పత్  మానేరు వాగు నుండి ఇసుకను దొంగలించి అక్రమంగా రవాణా చేస్తుండగా  దుర్షె డ్ వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

అట్టి  ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి  తెలిపారు.