3 June, 2026 | 1:12 AM

రైతులు రసాయన ఎరువుల వాడకం

03-06-2026 12:40 AM

జమ్మికుంట జూన్ 2(విజయ్ క్రాంతి) రైతు లు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ వ్యవసాయం చేయాలని    కరీంనగర్ జిల్లా కలెక్టర్  చిత్రా మిశ్రా పేర్కొన్నారు.  మంగళవారం జమ్మికుంట పట్టణంలో ని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ, కరీంనగర్  వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన యాజమాన్య సంస్థ   ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్     గోడపత్రికను  ఆవిష్కరించి, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 

నేల ఆరోగ్య పరిరక్షణ పై రైతులు అవగాహన పెంచుకొని రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలకు అనుగుణంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు సూ చించారు. అనంతరం   జిల్లా వ్యవసాయ అధికారిభాగ్యలక్ష్మి మాట్లాడుతూ... రైతు లు పంటల సాగు లో వైవిధ్యం పాటిస్తూ రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. అంతకుముందు కె.వి.కె ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్  ఎన్. వెంకటేశ్వర్ రావు ,ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఛత్రూ నాయకులు మాట్లాడుతూ... ప్రస్తుతం  పంట అవశేషాలను తగలబెట్టకుండా పొలంలో కలియ దున్నుకోవాలనీ, పచ్చి రొట్టె ఎరువుల సాగు చేసుకొని యూరియా వంటి రసాయన ఎరువులు వాడకం తగ్గించుకోవచ్చన్నారు.