calender_icon.png 15 May, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ దుకాణాల్లో తూకంలో మోసం

15-05-2025 02:24:40 AM

  1. గన్ని బ్యాగ్‌తో తూకం లబ్ధిదారునికి ఇచ్చేది బియ్యం 
  2. ఒక్కో బస్తాకు రెండు కిలోలకు పైగా దోచుకుంటున్న రేషన్ డీలర్లు
  3. కొత్తగా చేర్చిన  కుటుంబ సభ్యుల బియ్యం నొక్కేసిన పలువురు డీలర్లు

గజ్వేల్, మే14: పౌరసరఫరాల శాఖ నిర్వహిస్తున్న రేషన్ దుకాణాలలో డీలర్లు యదే చ్చగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల కు న్యాయంగా పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని అందిన కాడికి దోచుకుంటున్నారు. లబ్ధిదారులకు కేటాయించిన రేష న్ బియ్యాన్ని తూకం వేసే సమయంలో  గ న్ని బ్యాగ్ తో తూకం వేసి బియ్యం మాత్రమే లబ్ధిదారులకు పంపిస్తున్నారు.

ప్రతి బస్తా నుండి  దాదాపు నాలుగైదు కుటుంబాలకు  రేషన్ బియ్యం ప్రతినెల పంపిణీ చేస్తుంటా రు. అంటే ప్రతి బస్తా నుండి దాదాపు రెండు కిలోల చొప్పున డీలర్లు మిగిల్చుకుంటున్నా రు. ఒక్కో డీలర్ కు సరాసరి 70 నుండి 100 క్వింటళ్లకు పైనే ప్రభుత్వం రేషన్ బి య్యం పంపిణీ కోసం కేటాయిస్తుంది. ఒక డీలర్ దాదాపు నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని  మిగుల్చుకుంటున్నారని అర్థమవుతుంది.

గన్ని బ్యాగుతో సహా తూకం వేసి బియ్యం మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నా ఉచిత బియ్యమే కావడంతో లబ్ధిదారులు కూడా ఏమీ అడగకుండా ఇచ్చినవి తీసుకు వెళ్తున్నారు. కానీ నెల నెల నాలుగు క్వింటాళ్లకు పైగానే రేషన్ బియ్యం డీలర్లు కాదేసి బ్లాక్ మార్కెట్కు అమ్ముకుంటున్నారు. 

ఇవ న్నీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవ డం గమనార్హం. రేషన్ పంపిణీ చేస్తున్న సమయంలో అధికారులకు తనిఖీలు చేపట్టక పోవడంతో ఇలాంటి అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెవెన్యూ అధికారుల కు తెలిసే ఇదంతా జరుగుతుందని ప్రజలు చెప్పుకోవడం మరింత చర్చకు దారి తీస్తుం ది.

అంటే రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ప్రజలకు అందాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, జి ల్లాస్థాయి యంత్రాంగం ఉచిత రేషన్ బి య్యం పంపిణీ వ్యవస్థ పై దృష్టి సారించి ల బ్ధిదారులకు పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

కొత్తసభ్యుల బియ్యం నొక్కేసిన డీలర్లు

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులలో కొత్తగా చేర్చిన కుటుంబ సభ్యులకు కూడా రేషన్ కోట అందజేయగా, పలువురు రేషన్ డీలర్లు మాత్రం కొత్త సభ్యులకు కేటాయించి న బియ్యాన్ని కాజేసినట్లు తెలుస్తుంది. కొన్ని రేషన్ దుకాణాలలో  కొత్తకోట తో సహా రేష న్ బియ్యం తూకం వేసి మళ్లీ అందులో నుం చి కొత్త సభ్యులకు కోటా బియ్యాన్ని తిరిగి తీసుకున్నట్టు తెలిసింది. అటు తూకంలోనే మోసం చేయడం కాకుండా, ఇటు కొత్త స భ్యుల కోటా బియ్యాన్ని కూడా రేషన్ డీలర్లు కాజేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.