calender_icon.png 15 May, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో 2వ రోజు ఉపాధ్యాయులకు మాదకద్రవ్యాలపై అవగాహన

15-05-2025 02:23:47 AM

కొత్తపల్లి, మే 14:  కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో జిల్లా పరిపాలన అధికారి శ్రీమతి పామెల సత్పతి ఐఏఎస్,  కరీంనగర్ గారి సారధ్యంలో మరియు  సిహెచ్.వి.ఎస్. జనార్ధన రావు , జిల్లా విద్యాధికారి  మార్గదర్శకమున నిర్వహింపబడుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా  పిశ్రీనివాసరావు, జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సుపర్‌ఇంటెండెంట్ హాజరై మాట్లాడుతూ మాదకద్రవ్యాలు మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగిస్తాయని ముఖ్యంగా మెదడు పైన నాడి వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడతాయని చెప్పారు.

నేడు చాలా మంది విద్యార్థులకు అవగాహన లేమితో మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని ఇది అభివృద్ధికి పెద్ద ఆటంకమని ఈ ఆటంకాన్ని తొలగించేటువంటి బాధ్యత మీదే అని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలను తరగతి గదిలో అమలుపరచడమే కాకుండా విద్యార్థులలో చైతన్యం కలిగించాలని మరియు వీటి వాడకం పట్ల కలిగే అటువంటి హానీలను వివరంగా తెలిపి వాటి నుండి దూరం  చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐలు జి.రాము,  ఎస్.అశోక్ కుమార్,  ఎస్‌ఐలు కే.లక్ష్మణ్, మహమ్మద్ ఇషాక్,  కే అశోక్ రెడ్డి, కోర్స్ సమన్వయకర్త డి.ఆనందం,  కొత్తపల్లి మండల విద్యాధికారి, రిసోర్స్ పర్సన్స్ మరియు ప్రభుత్వ టీచర్లు పాల్గొన్నారు.