calender_icon.png 27 August, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

26-08-2025 11:49:08 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పి కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... బుధవారం నుండి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించాలన్నారు. అలాగే కేసుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో అక్రమ దందాలపై దృష్టి సాధించి నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల కళాశాల స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సూచించారు. దొంగతనాల నివారణకు నైట్ బీట్ ఏర్పాటు చేయాలన్నారు.