calender_icon.png 27 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి: ఏఓ శ్రీనివాస్

26-08-2025 11:58:49 PM

మఠంపల్లి: రైతులు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ... 2025-2026 సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వ్యవసాయ పనిముట్లను రైతులకు 40 నుంచి 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారని, SC,ST మహిళా, చిన్న, సన్నకారు  (5ఎకరాల లోపు ఉన్న) రైతులకు 50% సబ్సిడీ వుంటుందని,పెద్ద రైతులకు 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున కావలసిన రైతులు 06.09.2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు చేసుకోవడానికి కావలసినవి  1. దరఖాస్తు ఫారం, 2. పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, 3. ఆధార్ కార్డు జిరాక్స్, 4.ట్రాక్టర్ కు సంబంధించిన పనిముట్లు అయితే ట్రాక్టర్ RC జిరాక్స్ ( భార్య పేరు మీద గానీ లేదా  భర్త పేరు మీద గానీ ట్రాక్టర్ ఉన్న పర్వాలేదు), 5. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు 2 తీసుకొని మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి  కార్యాలయానికి,వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరు.రైతు కట్టవలసిన నగదు డిడిను తెలియజేస్తామని, వ్యవసాయ పనిముట్ల కొరకు ముందుగా దరఖాస్తు చేసిన రైతులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఇఓ, సిబ్బంది పాల్గొన్నారు.