26-08-2025 11:53:36 PM
మంథని,(విజయక్రాంతి): చికిత అద్భుత విజయం తెలంగాణకే కాక భారత దేశానికి గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భారతదేశ యువ ఆర్చర్ చికిత తనిపర్తి ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో అండర్ - 21 ప్రపంచ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించిందన్నారు.
ఆమె అద్భుతమైన విజయం తెలంగాణకు గర్వకారణమే కాకుండా, భారత యువత ప్రతిభ, అంకితభావం, పట్టుదలకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్ పూర్ గ్రామం నుండి వచ్చిన చికిత, తనకృషి, దార్శనికతతో ప్రపంచ వేదిక మనకు అందుబాటులో ఉందని చూపించిందన్నారు. ఆమెకు తన హృదయపూర్వక అభినందనలు మంత్రి తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.