22-09-2025 12:02:51 PM
న్యూఢిల్లీ: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping case) కేసులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిర్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. అక్టోబర్ 8న తదుపరి విచారణ చేపడుతామని జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సహకరించట్లేదని వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు సహకరించట్లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్, కంప్యూటర్ల పాస్ వర్డ్ కూడా చెప్పడం లేదని ఎస్ జీ పేర్కొన్నారు. విచారణకు సహకరించని ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోర్టు నోటీసులు ఇచ్చినా రాష్ట్రానికి రాకుండా పారిపోయారని న్యాయవాది తెలిపారు. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారని చెప్పారు. అధికార ల్యాప్ టాప్, కంప్యూటర్, మెబైల్స్ లో ఆధారాలు చెరిపేశారని వాదించారు. ప్రభుత్వం ఆధారాలు అన్ని చెరిపేసినట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని తెలిపింది. రాజకీయ నేతలు, అధికారుల ఫోన్ల ట్యాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఎప్పుడు పిలిచినా ప్రభాకర్ రావు విచారణకు వెళ్లారని ఆయన తరుపు న్యాయవాది వెల్లడించారు. ప్రభాకర్ రావును 15 సార్లు పిలిచి ప్రశ్నించారని న్యాయవాది శేషాద్రి నాయుడు పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే ప్రభాకర్ రావును వేధిస్తున్నారని శేషాద్రి నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు శేషాద్రినాయుడు సమయం కోరారు. దీంతో జస్టిస్ నాగరత్న ధర్మాసనం రెండు వారాలు సమయం ఇచ్చింది.