22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

మహారాజా అగ్రసేన్ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి

22-09-2025 11:34 AM

హైదరాబాద్: మహారాజా అగ్రసేన్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పుష్పాంజలి ఘటించారు. మహారాజ్ అగ్రసేన్ జయంతిని(Agrasen Maharaj Jayanti) పురస్కరించుకుని అఖిల భారత వైశ్య ఫెడరేషన్(All India Vaish Federation), తెలంగాణ అగర్వాల్ సమాజ్ సంయుక్తంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అగ్రసేన్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల భారత వైశ్య సమాఖ్య అధ్యక్షుడు గిరీష్ సంఘితో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.