calender_icon.png 22 September, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి అండగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ

22-09-2025 11:40:41 AM

నిత్యవసర సరుకులు పంపిణీ 

మందమర్రి,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి మేమున్నామంటూ నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ(Public Service Welfare Society) సభ్యులు. పట్టణంలోని మూడో జోన్  రామాలయం సమీపంలో టైలర్ వృత్తి చేసుకుని జీవిస్తున్న హనుమాoడ్ల శ్రీనివాస్ గత కొద్ది కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడంతో పూట గడవని పరిస్థితి నెలకోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు వచ్చి తమ వంతుగా బాధిత  కుటుంబానికి అండగా నిలిచారు.

మాయ ఫౌండేషన్ సహకారంతో 25 కిలోల బియ్యం నెలకి సరిపడా నిత్యవసర సరుకులను అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భం గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమొద్దీన్  జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ లుమాట్లాడారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు ఎలాంటి కష్టం ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకు వస్తే  సంస్థ తరఫున మా వంతు సహాయం అందించి, నిరుపేదలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జావిద్ పాషా, చిలువేరి రాజు, నాగరాజు, శేఖర్, అరుణ్ దేవ్ లు పాల్గొన్నారు.