22 August, 2026 | 7:55 AM

ఎంఎంటీఎస్ రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

12-06-2024 01:54 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): ఎంఎంటీఎస్ రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసు  కుంది. ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతానికి చెం దిన హరినాథ్ కుమారుడు జనసూ ర్య(20)  ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తుండగా యాకత్‌పుర రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమా దవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.