4 May, 2026 | 4:12 AM

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉచిత కోచింగ్

04-05-2026 02:56 AM

వెల్దండ మే 3 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకుల జీవితాల్లో వెలుగులు పంపాలని ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు టాస్క్ సీఈఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సింగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్త్స్ర కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ శిక్షణా శిబిరాన్ని ప్రా రంభించారు. శిక్షణ శిబిరాలను  నిరుద్యోగులు సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్ నాయ క్, రమేష్ నాయక్ నారాయణ నాయక్ కొండల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.