అలంపూర్ చౌరస్తాలో ప్రతి సోమవారం ప్రజావాణి
అలంపూర్ మే 3:ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో ప్రతి సోమవారం ఆర్డీఓ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి ఉంటుందని,అన్ని శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులందరూ అందుబాటులో ఉంటారని వివరించారు.
పరిసర ప్రాంతాలైన కాబట్టి అలంపూర్ ఉండవల్లి ,మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి మండలాల కు చెందిన ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇట్టి ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వ అధికారులు స్వీకరించి సిజిజి పోర్టల్ లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కారం సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.






