calender_icon.png 12 November, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోడిన్ ప్రాధాన్యత తెలుసుకోవాలి

12-11-2025 04:21:34 PM

జడ్చర్ల: పోషక ఆహారం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ జిల్లా కో ఆర్డినేటర్ జన్ ఎడ్వార్డ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో (బాయ్స్) "నేషనల్ ఎడ్యుకేషన్ డే"లో భాగంగా ' కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఆరోగ్య స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారి ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.

సామాజిక వయోజన మహిళలకు, గర్భిణీ స్త్రీలు, కౌమార బాల బాలికలకు అయోడిన్ ఉపయోగాలను బలవద్దకర మైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించారు. అయోడైన్ లోపం వలన జరిగే అనర్ధాల గురించి పూర్తి సమాచారం చెప్పడం జరిగింది. అలాగే వాటిని ఆదిగామించాలంటే ఎలాంటి ఆహారం మరియు అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకొవాలని చెప్పడం జరిగింది అనంతరం వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కృష్ణ, నర్సింహా, లక్ష్మాన్, సురేష్, నవనీత పాల్గొన్నారు.