13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు

31-03-2026 12:00 AM

ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రారంభించబడిన ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అన్నపూర్ణ, నాయకులు ఆడే గజేందర్, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్‌ఐలు పురుషోత్తం, సంజయ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.