calender_icon.png 12 January, 2026 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాంపురంలో అన్నదానం

04-01-2026 12:11:40 AM

పాల్గొన్న బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ 

సికింద్రాబాద్, జనవరి 3 (విజయ్‌క్రాంతి): కంటోన్మెంట్ ఆరో వార్డు సీతారాం పురం కాలనీ లోని శివ పంచాయతన ఆంజనేయ స్వామి దేవాలయం లో ఆలయ అధ్యక్షులు సాయిబాబా యాదవ్,కమిటీ సభ్యు లు ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి సందర్భంగా అన్న దాత సత్యనారాయణ కుటుం బ సభ్యులు అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్ హాజరయ్యారు.

అనంతరం ఆలయంలో వీరిరువురు  ప్రత్యేక పూజలు నిర్వ హించి, ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్, సంజీవ్, రాజేందర్, ఎస్‌ఎన్.చారి, చంద్రమౌళి, రాజు, శ్రీకాంత్ రెడ్డి తో పాటు స్థానికులు బండి శ్రీనివాస్, మధు, ప్రశాంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

న్యూ బోయినపల్లి సంజీవయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై నివేదన పంచామృ త అభిషేకం, భజన కీర్తనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, కొండల్ యాదవ్, పవన్ అయ్యప్ప స్వామి లు తదితరులు పాల్గొన్నారు.