calender_icon.png 12 January, 2026 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను కడతేర్చిన భార్య

04-01-2026 12:12:48 AM

ఉప్పల్ జనవరి 3 (విజయక్రాంతి) : మల్లాపూర్  మీర్పేట్ శాంతినగర్‌లో అక్ర మ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఐరన్ రాడ్‌తో భర్తపై దాడి చేసి హత్య చేసింది ఓ భార్య.  ఒడిస్సా కు చెందిన నారాయణ బెహరా (35) గత కొంత కాలం క్రితం భార్య బంధిత బెహరా మల్లాపూర్ మీర్పేట్ శాంతినగర్‌కి వలస వచ్చి ప్లంబర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఆరు సంవత్సరాల కూతురు ఉంది బంధిత బెహరా  గత కొంతకాలంగా  పక్కనే కిరాయికి ఉంటున్న  సాగర్‌తో అక్రమ సంబంధానికి పెట్టుకు న్నది. నారాయణ బెహరా భార్యను పలుమార్లు  హెచ్చరించడం జరిగింది.

తరచూ భార్యాభర్తలకు  గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 31 రాత్రి నారాయణ బెహరా  మద్యం సేవించి  ఇదే విషయంపై గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న నారాయణ ను  ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నా బంధిత బెహరా  ప్రియుడు సాగర్ తో కలిసి ఐరన్ రాడ్ తో  బలంగా తలపై కొట్టింది. దీంతో నారాయణ బెహరా  తలకు త్రీవ  గాయం కావడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల  సమాచారం మేరకు  నాచారం పోలీసులు సంఘటన స్థలం చేరుకొని నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.  నిందితులైన బంధిత బెహరా సాగరను  రిమాండ్ కు  తరలించినట్లు నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ తెలిపారు