మత్తుకు దూరం.. సమాజానికి ఆదర్శం
చేవెళ్లలో డ్రగ్స్‌అవగాహన
చేవెళ్ల, జూన్ 2౨ (విజయక్రాంతి): చేవెళ్ల చైతన్య కళాశాలలో పోలీసు, వైద్య శాఖల ఆధ్వర్యంలో డ్రగ్స్పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.సదస్సు లో మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, కుటుంబాలు పూర్తిగా నాశనమవుతాయని ఎస్‌ఐ సంతోష్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై పడేదుష్పరిణామాలను వైద్యులు, చట్టపరమైన ఇబ్బందులను పోలీసులు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.ఈ మహమ్మారికి యువత దూరంగా ఉండి, జీవితంలో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని సదస్సులో పిలుపునిచ్చారు. సుమారు 250 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని వక్తలు సూచించారు.






