23 June, 2026 | 1:37 AM

అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

23-06-2026 12:34 AM

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బా ధితుల సంఘం అధ్యక్షురాలు వశ్య పద్మ డిమాండ్ చేశారు. తెలంగాణ అగ్రిగోల్డ్ బా ధితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆనంద్ అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి పశ్య పద్మ మాట్లా డుతూ.. బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేయాలని కోరారు.

రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను బినామీ పేర్లతో ఉన్న వారి ఆస్తులను స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్ష ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమం లో సంఘం ప్రధాన కార్యదర్శి జివిఆర్, ఉపాధ్యక్షురాలు రజిత, మానవ హ క్కుల కమిటీ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడారు.