13 August, 2026 | 5:14 AM

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

13-08-2026 12:17 AM

సికింద్రాబాద్, ఆగస్టు12 (విజయక్రాం తి): ఎవరూ లేని వారికి దేవుడే దిక్కంటారు. అయినవారికి దూరమై ప్రభుత్వ వసతి హా స్టల్లో ఉంటున్న పిల్లల తోపాటు  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఆరోగ్యానికి మేమున్నామంటూ లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సంస్థ భోరోసా ఇ స్తుంది.

ఈ నేపధ్యంలో  లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సంస్థ, ఐకేఎస్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో బోయిన్ పల్లి బాపూజీనగర్ లోని ప్రభుత్వ  ట్రైబల్ వెల్ఫీర్ ఆశ్రమ ఉన్నత  పా ఠశాలలో ఉచిత దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సంస్థ సభ్యులు ఆర్ నారాయణ,ఆరోగొండ నర్సింహులు , బచ్చు లక్ష్మణ్ ,కె లింగయ్య లు అతిధులుగా హాజరై వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ దంత వైద్యం శిబిరంలో సుమారు 180 మంది  విద్యార్థులకు వైద్య సేవలు అందించినట్లు తెలియజేశారు..