calender_icon.png 21 August, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సత్యవతిలో ఉచిత వైద్య శిబిరం

21-08-2025 11:15:55 AM

నల్లగొండ టౌన్(విజయక్రాంతి): మూడవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత వైద్యం(Free medical camp)  ఏర్పాటు చేసినట్లు  ఎముకలు, నరాల వైద్య నిపుణులు  డాక్టర్ సూరే పల్లి  రాం మనోహర్ గురువారం తెలిపారు. ఈ శిబిరంలో రూ. 2500 విలువ గల  బిఎండి  పరీక్షలు ఉచితంగా  చేపడుతున్నామని పేర్కొన్నారు. దానితోపాటు రోగులకు ఉచిత ఓపి, అన్ని రకాల స్కానింగ్, రక్త పరీక్షలపై 50 శాతం  డిస్కౌంట్ ఏర్పాటు చేశామని  అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.