11-11-2025 12:42:09 AM
-సర్కారు దవాఖానాల్లో మందుల కొరత..!?
-ప్రిష్కిప్షన్ రాసి బయటకు పంపుతున్న వైద్యులు...
-ఫిరమవుతున్న ప్రభుత్వ వైద్యం
మంచిర్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సర్వసాధారణం గా రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జిల్లా ప్రజలతో పాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి సైతం వైద్యం నిమిత్తం మంచిర్యాలకు వస్తుంటారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిలో 90 శాతం రోగులు పేద వారే వస్తుంటారు. కానీ ఆసుపత్రిలో మందుల కొరత..!? తో వారి జేబులకు తూట్లు పడకతప్పడం లేదు.
డబ్బు లు లేక సర్కారు దవాఖానకొస్తే మందు గోళీలు లేవని బయటకు పంపుతుండటం తో ఉచిత వైద్యం ఉత్తదే అవుతుందని రోగు లు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు అనారోగ్యం (జలుబు)తో బాధపడు తుండగా సోమవారం జిల్లా ప్రభు త్వ ఆసుపత్రికి భార్య, కొడుకుతో వచ్చి మందులు లేవని, భయట కొనుక్కోమనడంతో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదు చేసిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది.
తెల్ల చిట్టీలపై ప్రిస్కిప్షన్ రాసి పంపుతున్న వైద్యులు...
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోగులకు తెల్ల చిట్టీలపై మందులు రాసి పంపుతుండ్రు. ఓపీకి వచ్చే రోగులకు వైద్య పరీక్షల అనంతరం ఓపీ చిట్టీపైన మం దులు రాసిస్తు ఉన్నవి ఇక్కడ తీసుకోండ్రి.., లేనివి భయట తీసుకోండ్రని ఉచిత సలహాలు ఇస్తున్నారు... మరోవైపు వైద్యులు రౌండ్లకు వెళ్లిన సమయంలో ఇన్ పేషెం ట్ల అటెండర్లకు తెల్ల చిట్టీలపై మందులు రాసి తీసుకచ్చుకోండని చెప్పి వెళుతున్నారు. ఆ చీటి తీసుకొని ఫార్మసీలో చూపిస్తే ఇవి లేవు, బయటకు వెళ్లి తెచ్చుకోమని సలహాలిస్తున్నారు... డబ్బులు లేక ప్రభుత్వాసుపత్రికొస్తే తిండికి తెచ్చుకున్న డబ్బులు ఖర్చు చేస్తున్నామని బాధ వెల్లగక్కుతున్నారు.
మరోవైపు ప్రిస్కిప్షన్ వైద్యులు రాసి పంపుతున్నారా! లేదా వార్డు నర్సింగ్ ఆఫీసర్ రాసిస్తున్నారా! మరెవరైనా సిబ్బంది ఇస్తున్నారో కూడా తెలియడం లేదని, చిట్టీ తీసుకొచ్చి ఇవి తెచ్చుకుంటే ఇంజక్షన్ వేస్తామని, సెలేన్‌లు పెడుతామని, మందులు తెచ్చుకొని వేసుకోండని చెప్పి వెళుతున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని రోగుల బంధువులు పేర్కొంటున్నారు. పైసలు లేకనే ఇక్కడికొస్తే వైద్యం ఫిరమవుతుందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వేదవ్యాసను వివరణ కోరగా.. విచారించి బాధ్యు లపై చర్యలు తీసుకుంటామన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి రావాల్సిన మందులు సైతం ఆలస్యంగా వస్తున్నాయని, కావాల్సిన మందులు రాకపోవడంతో కొంత ఇబ్బంది అవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
మందులు ప్రైవేటులో తీసుకోమన్నరు...
నా కొడుకు చాలా రోజులుగా జలుబు, నంజుతో బాధపడుతుండు. మొదట ఇంట్ల ఉన్న డబ్బులతో మంచిర్యాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుపోయి చూయించిన. డబ్బులన్నీ పరీక్షలకు, మందులకే అయిపోయినయ్. ఎంతకీ తగ్గకపోవడంతో సోమ వారం పొద్దుగాల భార్య అనూషతో కలిసి కొడుకు హర్షవర్ధన్ (2)ని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్‌కు చూపించిన. డాక్టర్ పిల్లగాడిని చేత పట్టకుండానే ఏమైందని అడిగి డైరెక్టుగా మందులు రాసిచ్చిండు. ఆ మందులే ఫార్మసీలో లేవని, రెండు ఇచ్చి మిగితావన్నీ భయట కొనుక్కోమని చెప్పి వెల్లగొట్టిండ్రు. పెద్దాసుపత్రి అని వస్తే చూడకుండనే, మందులు సైతం ఇయ్యకుండనే పంపిండ్రు... కలెక్టర్‌కు కంప్లేంట్ చేసిన.
కాసర్ల తిరుపతి, మందమర్రి