calender_icon.png 11 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్‌తో 470 ఎకరాల పంట నష్టం

11-11-2025 12:17:12 AM

క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించిన వ్యవసాయ అధికారులు

ఆమనగల్లు, నవంబర్ 10 (విజయ క్రాం తి): ఇటీవల కురిసిన మోంథా తుపాన్ కారణంగా జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను చేత స్థాయిలో సేకరించి  ప్రభుత్వానికి వ్యవసాయ అధికారులు నివేదిం చారు. రంగా రెడ్డి జిల్లాలోని 470 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని  జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా లేకుండా పలు మండలాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు  చెరువులు, కుంటలు నిండి అలుగులు పరాయి.

తలకొండపల్లి మండలంలోని  వెల్జాల గ్రామంలో సహా దేవి చెరువు 35 ఏళ్ల తర్వాత నిండడం గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తలకొండపల్లి మండలం, ఆమనగల్ కర్తాల్  పలుచరులు కుంటలకు భారీగా నీరు చేరాయి. దీంతో ఆమనగల్, మాడుగుల, తలకొండపల్లి, షాద్నగర్, ఫరూక్నగర్ మండలం లో  పత్తి, వరి చేలల్లో నీరు చేరడంతో చేతికొ చ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెజార్టీగా  పత్తి పంట దెబ్బతింది. పలువురు రైతులు అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న తమన ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జ ఆయా మండల ల్లోని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించారు.

పత్తి, వరి పంటకు దెబ్బ..

జిల్లా వ్యాప్తంగా మెజార్టీగా వరి పత్తి పంటకు  నష్టం వాటిల్లింది. ఫరూక్నగర్ మండలం, మహేశ్వరం నియోజకవర్గం, కేశంపేట, తలకొండపల్లి, యాచారం, ఆమనగల్లు, మాడుగుల మండ లాల్లోని పంటలకు నష్టం కలిగింది.  యాచారం మండలం లో  పలు ఎకరాల లో వరి పంట పూర్తిగా నీళ్లల్లోనే మునిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా మండలాల్లో సరాసరిగా 250 వరకు  పైగా రైతులకు చెందిన 470 ఎకరాల్లో పంటలు అధికారులు గుర్తించారు.

దెబ్బతిన్న పంటల విలువల యావరేజ్ గా రూ.32.47 లక్షలు అంచనా ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ  రాష్ట్ర ప్రభుత్వంకు నివేదిక అందజేశారు.  మోంధా తుపానుతో నష్టపోయిన పం టలకు ఎకరాకు రూ.పది వేల పరిహారాన్ని అంద జేస్తామని రాష్ట్ర సర్కార్ ప్రకటించినంది. అయితే వరి,పత్తి పంటలకు ఎకరాకు  సాగుకు రూ. 20 వేల నుంచి 60 వేల పైగా ఖర్చు అయిందని ప్రభుత్వం 10000 నష్టపరిహారం అందిస్తే  తాము తీవ్రంగా నష్టపోతామని పరిహారం పెంచాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బాధితుల రైతులకు పరిహారం అందుతుంది..

తుపాను కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. క్లస్టర్ వారిగా పంట నష్ట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషా తెలిపారు. త్వరలోనే బాధిత రైతులకు పరిహారం అందుతుంది