12-11-2025 08:53:39 PM
ఎస్ టియు మండల అధ్యక్షులు సందీప్..
రేగోడు: 2024 ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ గురునాథ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ టి యు మండల అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ 2024 సంవత్సర ఉపాధ్యాయుల సర్వీస్ బుక్ ఎంట్రీ ఐఎఫ్ ఎంఎస్ ఎడిటింగ్ ఆరు రోజుల వేతనం గురించి పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు మండల ఉపాధ్యక్షులు ఆదిత్య గౌడ్, ఎస్ టి యు మండల ప్రధాన కార్యదర్శులు నరేష్, పూజ, ఎస్ టి యు మండల కార్యదర్శులు అనూష, స్రవంతి పాల్గొన్నారు.